Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.63 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో

Follow Udayam on Google
Udayam Desk Sep 26, 2026 8:17 PM జగిత్యాలGeneral
రూ.63 వేల లంచం.. ఏసీబీకి చిక్కిన సీడీపీవో - Udayam
జగిత్యాల జిల్లా మెట్పల్లి సీడీపీవో దరోజు పద్మ రూ.63 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. 21 అంగన్‌వాడీ కేంద్రాల నుంచి తనిఖీల్లో ప్రతికూల నివేదికలు ఇవ్వకుండా ఉండేందుకు ఒక్కో కేంద్రం నుంచి నెలకు రూ.1,000 చొప్పున డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆమె వద్ద నుంచి లంచం మొత్తాన్ని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. కరీంనగర్‌ ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు.

Comments

G
Loading comments...