Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

550 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:38 PM నాగర్ కర్నూల్General
550 పడకల ఆసుపత్రి పనుల పరిశీలన - Udayam
నాగర్‌కర్నూల్‌లో మెడికల్‌ కాలేజీకి అనుబంధంగా 10 ఎకరాల్లో రూ.235 కోట్లతో నిర్మిస్తున్న 550 పడకల ఆసుపత్రి పనులను ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ఎమ్మెల్యే సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...