Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికల గురుకులంలో 52 మంది విద్యార్థినులు అస్వస్థత

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 30, 2026 7:37 AM విజయనగరంGeneral
బాలికల గురుకులంలో 52 మంది విద్యార్థినులు అస్వస్థత - Udayam
విజయనగరం జిల్లా తాటిపూడి ఏపీ రెసిడెన్షియల్‌ కళాశాలలో 52 మంది విద్యార్థినులు జ్వరం, ఒళ్లునొప్పులతో అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఏడుగురిని ఎస్‌.కోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన విద్యార్థినులకు కళాశాలలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ, డీఈఓ బాధితులను పరామర్శించారు. ఘటనతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

Comments

G
Loading comments...