Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

45వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:24 PM సూర్యాపేటGeneral
45వ వార్డులో సీసీ రోడ్డుకు శంకుస్థాపన - Udayam
సూర్యాపేటలోని 45వ వార్డులో రూ.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణానికి మున్సిపల్ ఛైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత శంకుస్థాపన చేశారు. ప్రజా ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మున్సిపాలిటీకి రెండు విడతల్లో 1,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని, 3,500 మందికి పెన్షన్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...