వార్తలకు తిరిగి వెళ్లండి

మోహిత్ పెడాడ, శృతి శంకర్ జంటగా రాజేష్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కనున్న '2కె లవర్స్' చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి వీఎన్ ఆదిత్య క్లాప్ కొట్టగా, మణిశర్మ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ నేపథ్యంలో ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలతో సినిమాను రూపొందిస్తున్నట్లు దర్శకుడు రాజేష్ నాయుడు తెలిపారు.
Comments
Loading comments...

