Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ నుంచి క్షేమంగా చేరుకున్న 28 మంది ఏపీ యాత్రికులు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 10:11 AM జాతీయంGeneral
నేపాల్‌ నుంచి క్షేమంగా చేరుకున్న 28 మంది ఏపీ యాత్రికులు - Udayam
నేపాల్‌ వరదల్లో చిక్కుకున్న 68 మంది ఏపీ వాసుల్లో 28 మంది సురక్షితంగా స్వస్థలాలకు చేరుకున్నారు. మానస సరోవర్‌ యాత్రకు వెళ్లిన వీరు పలు బృందాలుగా హైదరాబాద్‌, విజయవాడ చేరుకున్నారు. మరో 13 మంది ఆచూకీ ఇంకా లభించకపోవడంతో వారి కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. మిగిలిన వారి వివరాలను సేకరిస్తున్నారు. ఆదోనికి చెందిన భాస్కర్‌శాస్త్రి కుటుంబం కూడా సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...