Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

16 ఏళ్లుగా మట్టి గణపతే

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:29 AM సిద్దిపేటGeneral
16 ఏళ్లుగా మట్టి గణపతే - Udayam
నంగునూరు మండల కేంద్రంలోని బురుజు వద్ద ఆదర్శ ఫ్రెండ్స్‌ యూత్‌ సభ్యులు 16 ఏళ్లుగా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ ఏడాది రూ.15 వేలతో సిద్ధిపేటలో ఎనిమిది అడుగుల మట్టి గణనాథుడిని కొనుగోలు చేసినట్లు కమిటీ సభ్యుడు భాస్కర్‌రెడ్డి తెలిపారు. సహజ రంగులతో విగ్రహాన్ని తయారు చేశారని, ప్రకృతి వనరుల పరిరక్షణే లక్ష్యంగా మట్టి గణపతిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Comments

G
Loading comments...