Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం

Follow Udayam on Google
Anuroop Sep 25, 2026 10:14 AM తిరుపతిGeneral
శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం - Udayam
తిరుమలలో శుక్రవారం శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ప్రత్యేక టోకెన్లు లేని సర్వదర్శనానికి భక్తులు సుమారు 12 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. ప్రస్తుతం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం 67,534 మంది శ్రీవారిని దర్శించుకోగా, 25,411 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.40 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...