వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లి మండలంలోని గూడెం గుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో 113 మంది జంటలతో వేద పండితులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేయించారు. భాద్రపద పౌర్ణమి సందర్భంగా శనివారం గూడెం దేవాలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు, ప్రజలు భారీగా తరలి వచ్చారు.
అనంతరం దేవాలయంలోని స్వామి వారిని దర్శించుకుని వేద పండితులతో పూజలు చేయించారు. అలాగే అధికారులు, దాతలు భక్తులకు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించారు.
Comments
Loading comments...

