వార్తలకు తిరిగి వెళ్లండి

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కేంద్ర మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆయన, 3,245 ఎకరాల్లో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే 2 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. తెలంగాణకు మరో 4 ప్లగ్ అండ్ ప్లే పార్కులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు.
Comments
Loading comments...

