వార్తలకు తిరిగి వెళ్లండి

యువత స్వచ్ఛందంగా రక్తదానానికి ముందుకు రావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామపంచాయతీలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన మాట్లాడారు.
అత్యవసర సమయంలో రక్తం అందక ఇబ్బందులు తలెత్తకుండా రక్తదాతలు ముందుకు రావాలని సూచించారు. శిబిరంలో 30 మంది యువకులు రక్తదానం చేశారు. వారికి ఐఎంఏ ఆధ్వర్యంలో సర్టిఫికెట్లు అందజేశారు.
Comments
Loading comments...

