వార్తలకు తిరిగి వెళ్లండి

జూలూరుపాడు మండల కేంద్రంలో జరిగిన DYFI మండల మహాసభలో జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ మాట్లాడారు. యువత ఎదుర్కొంటున్న విద్య, ఉపాధి, ఉద్యోగ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు నిర్వహించాలని అన్నారు.
‘అందరికీ విద్య.. అందరికీ ఉద్యోగాలు’ లక్ష్యంతో యువతను సమీకరించి ఉద్యమాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. యువత హక్కుల కోసం DYFI ప్రజల పక్షాన పోరాడుతుందని తెలిపారు.
Comments
Loading comments...

