వార్తలకు తిరిగి వెళ్లండి

హనుమంతునిపాడులో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్సార్ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన మాటతప్పని, మడమ తిప్పని నేతగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారని వైసీపీ నాయకులు అన్నారు. వైఎస్సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.
Comments
Loading comments...

