Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 07, 2026 7:30 AM కడపGeneral
నేటి నుంచి వైఎస్ జగన్ కడప జిల్లా పర్యటన - Udayam
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు, రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. మంగళవారం ఉదయం పులివెందుల చేరుకుని, భాకరాపురం క్యాంప్ కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించి ప్రజల నుండి వినతులు స్వీకరిస్తారు. బుధవారం ఉదయం ఆయన ఇడుపులపాయకు వెళ్లి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడ జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం తిరిగి ప్రయాణమవుతారు.

Comments

G
Loading comments...