Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మత్స్యకారుల ఆచూకీపై ఆందోళన

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 07, 2026 7:18 AM విశాఖపట్నంGeneral
మత్స్యకారుల ఆచూకీపై ఆందోళన - Udayam
సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ రెండు రోజులైనా లభించకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన తీవ్రమైంది. దీంతో విశాఖ చేపలరేవు బోటు ఆపరేటర్ల సంఘ కార్యాలయంలో బాధితులు, నాయకులు సోమవారం నిరసన చేపట్టారు. ఆందోళనకారులతో ఆర్డీవో దిలీప్‌చక్రవర్తి మాట్లాడి నచ్చజెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...