Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాబు సర్కార్‌పై జగన్ మండిపాటు

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 07, 2026 7:04 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
బాబు సర్కార్‌పై జగన్ మండిపాటు - Udayam
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం ఆటవిక పాలన సాగిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో గూండాలు, రౌడీలతో దాడులు చేయిస్తూ బాధితులనే అరెస్ట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇటీవల జరిగిన ముగ్గురు మహిళల అనుమానాస్పద మరణాలు, దళిత యువకుడి ఆత్మహత్య వంటి ఘటనలను ప్రస్తావిస్తూ ‘హే రామ్.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Comments

G
Loading comments...