వార్తలకు తిరిగి వెళ్లండి

యర్రగొండపాలెం మండలంలోని గురిజేపల్లి, బోయలపల్లి గ్రామాల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో బుధవారం ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి కె. నీరజ రైతులకు పలు సూచనలు చేశారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటలు సాగు చేయాలని, మిరప, పత్తి వంటి అధిక నీటి అవసరమున్న పంటలకు దూరంగా ఉండాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని తెలిపారు.
Comments
Loading comments...

