Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బెట్టింగ్‌తో యువకుడి బలి

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 11, 2026 9:33 PM కరీంనగర్General
ఆన్‌లైన్ బెట్టింగ్‌తో యువకుడి బలి - Udayam
కరీంనగర్ జిల్లా కొండపలకల గ్రామానికి చెందిన పవన్ కల్యాణ్(25) ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల అప్పులపాలై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. రూ.లక్ష అప్పును కుటుంబ సభ్యులు తీర్చి, బెట్టింగ్ మానేయాలని మందలించినా ఈనెల 6న అతను విషం తాగాడు. కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పవన్ ఈరోజు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీలత తెలిపారు.

Comments

G
Loading comments...