Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం రాజీనామా చేయాలి: హరీశ్‌రావు

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 11, 2026 9:37 PM సిద్దిపేటGeneral
సీఎం రాజీనామా చేయాలి: హరీశ్‌రావు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. షాబాద్‌లో జరిగిన ఆరు హత్యలకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని శనివారం సిద్ధిపేటలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని విమర్శించారు. అత్యాచార నిందితుడికి బెయిల్ రావడానికి పోలీసులు, ప్రభుత్వం సహకరించాయని ఆరోపించారు.

Comments

G
Loading comments...