Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రూప్‌-2 ఉద్యోగం సాధించిన యువతి మృతి

Follow Udayam on Google
హరిక Aug 18, 2026 10:28 AM మహబూబాబాద్ తెలంగాణ
గ్రూప్‌-2 ఉద్యోగం సాధించిన యువతి మృతి - Udayam
గ్రూప్‌-2 ద్వారా డిప్యూటీ తహశీల్దార్‌ ఉద్యోగం సాధించిన డోలి సంధ్య(28) మహబూబాబాద్‌లో సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...