వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో యువతి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదైంది. ముత్తంగికి చెందిన తలారి మాధవి (20) సోమవారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులు తెలిపారు.
భర్త చెన్నయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఓ వ్యక్తిపై అనుమానం వ్యక్తం కావడంతో ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యువతి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి.
Comments
Loading comments...

