Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యంగ్ ఇండియా శిక్షణ బిల్లులు పెండింగ్

Follow Udayam Digital on Google
లక్ష్మి దేవి Aug 07, 2026 11:48 AM జనగామ తెలంగాణ
యంగ్ ఇండియా శిక్షణ బిల్లులు పెండింగ్ - Udayam Digital
ప్రభుత్వం 'యంగ్ ఇండియా' పేరుతో నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన నిధులు విడుదల కాక నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు వేసవి సెలవుల్లో ఈ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఒక్కో నిర్వాహకుడు రూ.50 వేలకుపైగా ఖర్చు చేసి బిల్లుల మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు. శిక్షణ ముగిసి నెలలు గడిచినా బిల్లులు విడుదల కాకపోవడంతో వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...