వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో యాసంగి పంటల సాగు విధానంపై సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్లు కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారి సంధ్య తెలిపారు. అధిక నీరు అవసరమయ్యే వరి సాగును తగ్గించాలని అధికారులు సూచించారు.
అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకుంటూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించినట్లు తెలిపారు. సమావేశంలో ఏపీఎం, పీఏసీఎస్ సీఈవో, ఏఈవోలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

