వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎండబ్ల్యూ కారు కాలిపోయిన కేసులో మహారాష్ట్రకు చెందిన రవికాంత్ పాటిల్‌కు రూ.70.75 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ ఆదేశించింది. 2012లో టైరు పంక్చర్ కావడంతో కారును రోడ్డు పక్కన నిలిపి వెళ్లగా, మరుసటి రోజు అది కాలిపోయింది.
దాదాపు 14 ఏళ్ల విచారణ తర్వాత కమిషన్ రూ.70 లక్షల బీమా మొత్తంతో పాటు మానసిక వేదనకు రూ.50 వేలు, ఖర్చులకు రూ.25 వేలు చెల్లించాలని తీర్పునిచ్చింది.
Comments
Loading comments...

