Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చొద్దు

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 5:09 PM తిరుపతిGeneral
తిరుమలను వ్యాపార కేంద్రంగా మార్చొద్దు - Udayam
తిరుమలలో కర్ణాటక స్టేట్ చారిటీస్‌కు కేటాయించిన 6.47 ఎకరాల భూమి విషయంలో టీటీడీ అధికారులు స్పందించాలని తిరుక్షేత్రాల రక్షణ సమితి ప్రతినిధి ఓంకార్ కోరారు. లీజు నిబంధనలు ఉల్లంఘిస్తే నోటీసులు ఇచ్చి, అవసరమైతే భూమిని స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల పవిత్రత, భక్తుల మనోభావాలను కాపాడాలని కోరుతూ 72 గంటల్లో స్పందించకపోతే టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన చేపడతామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...