Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రిలో శ్రీకాకుళం జిల్లా వాసి ఆత్మహత్య

Follow Udayam on Google
RAGHU SKLM Aug 27, 2026 7:08 PM శ్రీకాకుళంGeneral
యాదాద్రిలో శ్రీకాకుళం జిల్లా వాసి ఆత్మహత్య - Udayam
యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో ఇవాళ అంబటి జానకిరావు (32) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం జింకీభద్రకు చెందిన జానకిరావు రెండేళ్లుగా చౌటుప్పల్‌లో వెల్డింగ్ పని చేస్తున్నాడు. కొద్ది రోజులుగా పని లేక ఇంటివద్దే ఉంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని సీఐ మన్మధ కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...