Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగం పేరుతో రూ.1.93 లక్షల మోసం

Follow Udayam on Google
vihar Aug 22, 2026 3:27 PM ఏలూరుGeneral
వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగం పేరుతో రూ.1.93 లక్షల మోసం - Udayam
వర్క్‌ఫ్రమ్‌హోమ్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.1,93,500 మోసం చేసిన ఘటనపై ఏలూరు టూటౌన్‌ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై మధురాజు తెలిపిన వివరాల ప్రకారం.. కానుకొలను వారి వీధికి చెందిన రజినికి NSE టెలిగ్రామ్ గ్రూప్‌ ద్వారా ఉద్యోగం ఉందంటూ మెసేజ్ వచ్చింది. వివిధ దఫాల్లో రూ.1,93,500 పంపగా, మరో రూ.2 లక్షలు అడగడంతో నిరాకరించింది. దీంతో ఆమెను గ్రూప్‌ నుంచి తొలగించారు.

Comments

G
Loading comments...