వార్తలకు తిరిగి వెళ్లండి
జక్కంపూడిలో మహిళా జెట్ సిటీ

ఏపీఐఐసీ ప్రతిపాదన మేరకు జక్కంపూడి ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్‌ను ఎలీప్ సంస్థకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 60 చిన్న పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీనివల్ల వెయ్యి మందికి ఉపాధి లభించడంతో పాటు, ఏటా జిల్లా టర్నోవర్ రూ. 600 కోట్ల వరకు పెరిగే అవకాశం ఉంది.
Comments
Loading comments...