Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసుల్లో మహిళపై నిర్బంధ ఉత్తర్వులు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 13, 2026 9:57 AM నెల్లూరుGeneral
గంజాయి కేసుల్లో మహిళపై నిర్బంధ ఉత్తర్వులు - Udayam
నెల్లూరు సత్యనారాయణపురం పీసీ నాయుడు వీధికి చెందిన అరవ కామాక్షిపై ప్రభుత్వం పిట్‌ ఎన్టీపీఎస్‌ చట్టం సెక్షన్‌ 3(1) కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసింది. నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో ఆమెపై గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి మూడు కేసులు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసి నగర పరిసరాల్లో విక్రయిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆమెను కడప జైలుకు తరలించనున్నారు.

Comments

G
Loading comments...