వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని ఎన్‌ఏడీ పైవంతెన కింద భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉన్నప్పటికీ కొందరు డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీంతో ఎత్తైన వాహనాలు వంతెనను తాకుతూ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తున్నాయి.
సోమవారం ఓ భారీ వాహనం వంతెన కింద ఇరుక్కుపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
