Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.40 వేల కోట్లు ఏమయ్యాయి

Follow Udayam Digital on Google
Ravi Singh Jun 20, 2026 2:11 PM ఆల్ ఇండియాజాతీయ
రూ.40 వేల కోట్లు ఏమయ్యాయి - Udayam Digital
ఒడిశా బీజేపీ రెండేళ్ల పాలనపై పీసీసీ చీఫ్ భక్త దాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ప్రకటించిన రూ.40 వేల కోట్ల నిధుల్లో ఐదు శాతం కూడా ఖర్చు చేయలేదని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. గత మూడు నెలలుగా వృద్ధాప్య పింఛన్లు అందడం లేదని ఆయన మండిపడ్డారు. తిండి లేక ప్రజల పరిస్థితి దారుణంగా తయారైందని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...