Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అస్సాంలో ఏనుగు దంతాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
సాయి తేజ Aug 08, 2026 5:30 PM జాతీయంGeneral
అస్సాంలో ఏనుగు దంతాలు స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్ - Udayam
అస్సాంలోని తాముల్‌పూర్‌ జిల్లా బెంగాలీపారాలో ఎస్టీఎఫ్‌ పోలీసులు ఇద్దరి నుంచి రెండు ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకున్నారు. వాటి బరువు సుమారు 4.06 కిలోలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏనుగు దంతాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...