Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాటర్ ప్లాంట్‌లో కరెంట్ షాక్.. మహిళ మృతి

Follow Udayam on Google
Anuroop Sep 04, 2026 10:45 AM పశ్చిమగోదావరి General
వాటర్ ప్లాంట్‌లో కరెంట్ షాక్.. మహిళ మృతి - Udayam
పాలకొల్లులోని వాటర్ ప్లాంట్‌లో విద్యుత్ షాక్‌కు గురై ముంగండ దుర్గాభవాని (36) మృతి చెందారు. అడబాల గార్డెన్స్ సమీపంలోని ప్లాంట్‌లో ఆమె రెండేళ్లుగా పనిచేస్తున్నారు. గురువారం విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆమె భర్త రెండేళ్ల క్రితం మృతి చెందడంతో ఇద్దరు పిల్లలతో టిడ్కో గృహాల్లో నివసిస్తున్నారు. బంధువుల ఫిర్యాదుతో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...