వార్తలకు తిరిగి వెళ్లండి

కుందుర్పి ఎంజేపీ గురుకుల పాఠశాలలో 240 మంది విద్యార్థులు గత 15 రోజులుగా తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ పైపులైన్ సరఫరా అస్తవ్యస్తం కావడంతో తాగునీరు, స్నానాలు, కాలకృత్యాలకు అవస్థలు ఎదురవుతున్నాయి.
మూడు రోజులకు ఒకసారి స్నానాలు చేయాల్సి వస్తోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు నివేదించామని ప్రిన్సిపల్ హస్రత్‌వలి తెలిపారు.
Comments
Loading comments...

