Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకుల పాఠశాలలో నీటి సమస్య

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 16, 2026 12:06 PM మహబూబాబాద్ General
గురుకుల పాఠశాలలో నీటి సమస్య - Udayam
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్‌లోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో నెల రోజులుగా తీవ్ర నీటి సమస్య వేధిస్తోందని విద్యార్థినులు గురువారం ఆందోళన వ్యక్తం చేశారు. నీరు లేక దైనందిన అవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన చెందారు. తమ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, పాఠశాలలో శాశ్వత నీటి వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరారు.

Comments

G
Loading comments...