Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ వాట్సాప్‌ ఖాతాపై జలమండలి హెచ్చరిక

Follow Udayam on Google
హరిక Aug 17, 2026 7:03 PM మేడ్చల్ మల్కాజిగిరి General
నకిలీ వాట్సాప్‌ ఖాతాపై జలమండలి హెచ్చరిక - Udayam
జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి పేరు, ఫొటోతో కేటుగాళ్లు నకిలీ వాట్సాప్‌ ఖాతా సృష్టించి మోసాలకు యత్నిస్తున్నట్లు అధికారులు తెలిపారు. +84తో ప్రారంభమయ్యే విదేశీ నంబర్ల నుంచి వచ్చే సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద సందేశాలకు స్పందించవద్దని, డబ్బులు బదిలీ చేయడంతో పాటు ఓటీపీ, బ్యాంకు వివరాలు పంచుకోవద్దని ఎండీ అశోక్‌రెడ్డి కోరారు. అనుమానాస్పద నంబర్‌ను వెంటనే బ్లాక్‌ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...