వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగాల్‌లోని అక్రమ బంగ్లాదేశ్ వలసదారులపై సీఎం సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. తాము వెళ్లగొట్టకముందే చొరబాటుదారులు స్వచ్ఛందంగా దేశం విడిచి పారిపోవాలని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. లేనిపక్షంలో విదేశీయుల చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయన్నారు.
తమ పౌరులను తిరిగి తీసుకునేందుకు బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని సువేందు పేర్కొన్నారు. చొరబాటుదారులను జైళ్లలో పెట్టి అన్నం పెట్టాల్సిన అవసరం లేదని, వారిని వెంటనే సరిహద్దులు దాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
Comments
Loading comments...

