Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌ అభివృద్ధిపై కమిషనర్‌ ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
హరిక శర్మ Aug 06, 2026 12:09 PM వరంగల్General
వరంగల్‌ అభివృద్ధిపై కమిషనర్‌ ప్రత్యేక దృష్టి - Udayam
గ్రేటర్‌ వరంగల్‌ను స్వచ్ఛంగా, సుందరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కమిషనర్‌ టి.వెంకన్న తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, పార్కులు, శ్మశానవాటికలు, కాలనీల్లో వసతుల మెరుగుదలపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. ఇంటింటా చెత్త సేకరణను బలోపేతం చేస్తామని, అండర్‌ డ్రైనేజీ, వరద నీటి కాలువల పనులు త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. బహిరంగ ప్రచార నిషేధ నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...