వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు మాజీ కార్పొరేటర్ చెరుకూరి వసంత్ కుమార్ ఆకస్మిక మృతిపై టీడీపీ జిల్లా అధ్యక్షులు చెక్కుడుకుప్పం షణ్ముగం రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి, పేదలు, బడుగు బలహీన వర్గాల కోసం వసంత్ కుమార్ చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. గుండెపోటుతో ఆయన మృతి చెందడం పార్టీకి, చిత్తూరు ప్రజలకు తీరని లోటని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Comments
Loading comments...

