వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా కల్లూరు
లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను కల్లూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.42 లక్షల నగదు, 78 గ్రాముల బంగారం, 30 గ్రాముల వెండి కలిపి సుమారు రూ.13 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
పలు ఇళ్లు, ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులను ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.
Comments
Loading comments...

