వార్తలకు తిరిగి వెళ్లండి
అద్దంకి పట్టణం దామవారిపాలెం రైతులు వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ సోమవారం పోలేరమ్మ తల్లికి పులకాపన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా గ్రామం నుంచి పట్టణ వీధుల్లో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు.
అనంతరం జలాలతో పోలేరమ్మ తల్లికి పులకాపన చేసి, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండి, రైతుల కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
Comments
Loading comments...

