Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరలక్ష్మి వ్రతం వేళ పూల ధరలకు రెక్కలు

Follow Udayam on Google
sachin kumar Aug 21, 2026 9:17 AM కామరెడ్డిGeneral
వరలక్ష్మి వ్రతం వేళ పూల ధరలకు రెక్కలు - Udayam
నేడు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూల దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో దుకాణాలకు ముందుగానే పూలు కొనుగోలు చేసేందుకు మహిళలు, భక్తులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. పండగను ఆసరాగా చేసుకుని ధరలు పెంచారని కొనుగోలుదారులు వాపోతున్నారు. మల్లె కిలో రూ.1,200, చామంతి రూ.800, గులాబీ రూ.300, బంతి పూలు రూ.150 వరకు పలుకుతున్నాయి.

Comments

G
Loading comments...