Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంపిణీ చేసిన రోజే విరిగిన ట్రై సైకిల్

Follow Udayam on Google
Raghu Oct 05, 2026 12:44 PM శ్రీకాకుళంGeneral
పంపిణీ చేసిన రోజే విరిగిన ట్రై సైకిల్ - Udayam
​జిల్లా కేంద్రంలో ఎయిర్‌పోర్ట్ అథారిటీ సీఎస్ఆర్ నిధులతో ఆదివారం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు 230 మందికి దివ్యాంగ పరికరాలు పంపిణీ చేశారు.అయితే జలుమూరు మండలం చల్లవానిపేటకు చెందిన ఢిల్లీ రాజుకు ఇచ్చిన ట్రై సైకిల్ ఇంటికి తెచ్చిన రోజే విరిగిపోయింది. దీని ఛార్జర్ కూడా పనిచేయడం లేదని, ఇంటివద్దే విరగడంతో ప్రమాదం తప్పిందని బాధితుడు సోమవారం వాపోయాడు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరాడు.

Comments

G
Loading comments...