Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరద నీటిలో చిక్కుకున్న శ్రీలంక కాలనీ

Follow Udayam on Google
p.g.murthy Jul 30, 2026 1:29 PM మంచిర్యాలGeneral
వరద నీటిలో చిక్కుకున్న శ్రీలంక కాలనీ - Udayam
జన్నారంలోని శ్రీలంక కాలనీ వరద నీటిలో చిక్కుకుంది. గురువారం ఉదయం నుండి పడుతున్న భారీ వర్షానికి కాలనీలలోని రోడ్లపై నడుము లోతులో వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు బైక్లను తోసుకుంటూ వెళ్తున్నారు. గత సంవత్సరం కూడా భారీ వర్షాలకు శ్రీలంక కాలనీ పూర్తిగా మునిగిపోయింది. పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు.

Comments

G
Loading comments...