వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నాగావళి నదికి వరద ఉద్ధృతి పెరగడంతో జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నీటమునిగింది. నది పాఠశాలకు ఆనుకుని ఉండటంతో వరద నీరు ప్రాంగణంలోకి చేరింది.
అప్రమత్తమైన ఉపాధ్యాయులు విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించి, అక్కడే తరగతులు నిర్వహించారు. పాఠశాలలోకి నీరు చేరడంతో తల్లిదండ్రులు, గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

