వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగూడ తహసీల్దార్ శంకర రావు శనివారం ఓటరు జాబితా సవరణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బిల్లాపుట్టు, పోతంగి పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటరు ధ్రువీకరణ పనులను ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా బీఎల్‌వోలకు కీలక సూచనలు చేశారు. ఇంటింటికీ తిరిగి నిబంధనల మేరకు ఓటర్ల వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని, ప్రక్రియను వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
Comments
Loading comments...

