Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మచిలీపట్నంలో భారీ వర్షం: జలమయమైన బస్టాండ్

Follow Udayam on Google
రేఖ దేవి Jun 27, 2026 3:06 PM కృష్ణా జిల్లాGeneral
మచిలీపట్నంలో భారీ వర్షం: జలమయమైన బస్టాండ్ - Udayam
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శనివారం తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్‌ను వరద చుట్టుముట్టగా, కోనేరు సెంటర్ చెరువును తలపిస్తోంది. కొన్నిచోట్ల మోకాళ్ల లోతు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై చేరిన వర్షపు నీటిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...