వార్తలకు తిరిగి వెళ్లండి
ఎరువుల ధరల సెగ: ఆందోళనలో అన్నదాతలు
పవని రెడ్డి Jun 27, 2026 9:08 AM కడప 2 viewsabout 2 hours ago

సింహాద్రిపురం మండలంలో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కాంప్లెక్స్ ఎరువుల బస్తా ధర రూ. 550 వరకు పెరగడంతో సాగు వ్యయం భారమైంది. 12-32-16, 24-24-0 రకాల ధరలు రూ. 2450కి చేరాయి.
ఏడాదికి రెండుసార్లు కంపెనీలు ధరలు నిర్ణయించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెట్టుబడి భారం పెరగడంతో సాగును కొనసాగించడం కష్టమవుతోందని, ప్రభుత్వం వెంటనే స్పందించి ధరలను నియంత్రించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...