వార్తలకు తిరిగి వెళ్లండి

వంజరిపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల అరికట్టడంలో సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
రూరల్ ఎస్సై ఉమాసాగర్, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

