వార్తలకు తిరిగి వెళ్లండి

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఇరాన్‌లోని ఒక పురాతన శ్రీ మహా విష్ణువు దేవాలయానికి సంబంధించిన వీడియో సాంగ్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది.
ఇరాన్‌లోని అబ్బాస్ బండార్‌లో ఉన్న ఈ హిందూ దేవాలయాన్ని 1892లో అక్కడి హిందూ వ్యాపారుల కోసం నిర్మించారని, ఈ పాట పర్షియన్ భాషలో ఉందని అమితాబ్ పేర్కొన్నారు. ఇప్పటికే లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు.
Comments
Loading comments...

